చిన్మయికి ఓపెన్ ఛాలెంజ్

తమిళ రచయిత వైరాముత్తు తనను హోటల్‌ గదికి రమ్మన్నాడని గాయని చిన్మయి శ్రీపాద నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే . ఓ కార్యక్రమం కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లామని, వేదికపై పాట పాడామని కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ వెళ్లిపోయారు, కానీ ఆర్గనైజర్‌ నన్ను హోటల్‌లో వైరాముత్తును కలవాలని చెప్పారని ఎందుకని ప్రశ్నిస్తే.. కోపరేట్‌ చేయడం కోసమని , దానికి నేను ఒప్పుకోలేదని , ‘నీకు ఇక కెరీర్ లేదు’ అని ఆయన నాతో అన్నారని అంతేకాదు వైరాముత్తు తన స్నేహితురాల్ని కూడా లైంగికంగా వేధించారని ఆరోపించింది చిన్మయి.

దీనిపై తాజాగా వైరముత్తు ఓ వీడియో విడుదల చేశారు. ‘నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధాలు. అవి నిజమైతే.. ఆ మహిళలు నాపై కేసు పెట్టొచ్చు. చట్టపరంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మంచివాడినో, చెడ్డవాడినో ఒకరు చెప్పనక్కర్లేదు. న్యాయస్థానమే దాన్ని నిర్ణయిస్తుంది. కోర్టు తీర్పును నేను స్వాగతిస్తాను’ అని చెప్పారు.