తెరపైకి చిరంజీవి బయోపిక్..డైరెక్టర్ ఎవరు..?

ప్రస్తుతం అన్ని ఫిలిం ఇండస్ట్రీ లలో బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇక తెలుగులోనూ ఈ బయోపిక్ ల హావ నడుస్తుండడం తో అందరూ వీటిపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే సావిత్రి , ఎన్టీఆర్ బయోపిక్ లు రాగా ,మరికొన్ని సెట్స్ ఫై ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ను కూడా తెరకెక్కించాలనే ప్లాన్లో ఉన్నారట.

సినిమా ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి ఎంతో కష్టపడ్డాడు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన వైనం.. ఆ తర్వాత అల్లు రామలింగయ్య కూతురును పెళ్లి చేసుకోవడం , పెళ్లి తర్వాత చిరు కు మరిన్ని అవకాశాలు రావడం ఈ తర్వాత చిరు ఎలా ఎదిగాడు, చిరంజీవి మెగాస్టార్ గా అనేక సంచలనాలు, రికార్డులు సృష్టించిన తరువాత సడెన్ గా ప్రజారాజ్యం స్థాపించడం..ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం..ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఇవన్నీ కూడా చిరంజీవి కెరియర్ లో ముఖ్య ఘట్టాలు. అందుకే వీటిని అన్నింటితో బయోపిక్ తెరకెక్కించాలని చూస్తున్నారట.. మరి ఈ బయోపిక్ కు ఎవరు డైరెక్టర్ చేస్తారనేది చూడాలి.

ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి చరణ్ ప్రొడ్యూసర్.