నాగబాబు ఫై చేయి చేసుకున్న చిరంజీవి..

టైటిల్ చూసి షాక్ అవుతున్నారా..ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదులెండి. చిరంజీవి ఇంటర్ లో ఉన్నప్పుడు జరిగిన ఘటన. చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఎంత అనోన్యంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఒకరి ఫై ఒకరు ప్రేమను పంచుకుంటూ అందరికి ఆదర్శంగా ఉంటారు. ఓసారి నాగబాబు ఫై చిరంజీవి చేయి చేసుకున్న విషయం బయటపడింది.

చిరంజీవి ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాగబాబు 7వ తరగతి చదువుతున్నాడట. చిరంజీవి ఒక రోజు నాగబాబుకు లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురమ్మని చెప్పి మరేదో పనిమీద బయటకు వెళ్లాడట. పని ముగించుకుని వచ్చిన చిరంజీవికి నాగబాబు లాండ్రీకి వెళ్లలేదని తెలిసి బాగా కోపం వచ్చిందట. చెప్పిన పని చేయవా అంటూ చేయి చేసుకున్నాడట.

తమ్ముడిపై చేయి చేసుకోవడంపై అమ్మ కోప్పడిందని – అయితే నాన్న మాత్రం చిరంజీవిని సమర్దించాడట. చిరంజీవి కుటుంబ పెద్ద తరహాలో వ్యవహరించాడని నాన్న అభిప్రాయం. అందుకే నాన్న మద్దతు చిరంజీవికి దక్కింది. ఆ సమయంలో నాగబాబుపై చేయి చేసుకున్న చిరంజీవి ఆ తర్వాత చాలా బాధ పడ్డాడట. అప్పటి నుండి తమ్ముళ్లను మరింత ప్రేమగా చూసుకున్నాడట.