కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్

కరోనా కారణంగా అతలాకుతలమైన టాలీవుడ్ ఇండస్ట్రీ ఫై తెలంగాణ ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించడం ఫై యావత్ చిత్ర సీమా హర్షం వ్యక్తం చేస్తుంది. కోవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు, మినహాయింపులు ఇచ్చారు కేసీఆర్.

ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో షోలను పెంచుకునేందుకు అనుమతినివ్వడం మంచి నిర్ణయం. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టికెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు కష్ట సమయంలో సినీ పరిశ్రమకు, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్‌ నేతృత్వంలో ఆయన విజన్‌కు తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్న పూర్తి విశ్వాసం మాకుందని’ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Heartfelt Thanks to Hon’ble CM Shri. #KCR garu for the relief measures to the film industry. Trust that these compassionate measures surely will go a long way in reviving the industry badly hit by the pandemic and put it back on the path to progress. #TelanganaCMO pic.twitter.com/k7P2NUrtu2— Chiranjeevi Konidela (@KChiruTweets) November 23, 2020