ప్రముఖ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం !

తమిళంలో ఉన్న టాప్ కమెడియన్లలో వివేక్ ఒకరు. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా నిరూపించుకుంటున్నారు. శివాజీ, అపరిచితుడు, రోబో, రాజా రాణి వంటి పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యరు. తాజాగా అయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివేక్ తల్లి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె, కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు.

నిన్నటి వరకు బాగానే ఉన్న ఆమె ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వివేక్ తల్లి మరణ వార్తా విన్న కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. కొన్నాళ్ల క్రితం వివేక్ కొడుకు ప్రసన్న కుమార్(13)ను కోల్పోయారు. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమనే చెప్పాలి. వివేక్ హాస్య నటుడిగా రజనీకాంత్, విజయ్, అజిత్, విశాల్ సహా పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్‌గా అలరించారు.