దేఖొరే సోదరా అంటున్న నాగ శౌర్య

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల. మెద‌టి లుక్ తో విప‌రీత‌మైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం లో క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి టీజర్, ఓ సాంగ్, దాని మేకింగ్ వీడియో విడుదల అయి మంచి స్పందన అందుకున్నాయి.

టీజర్ కు యూట్యూబ్ లో దాదాపు ఎనిమిది మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఈ నేపథ్యంలో సినిమాలో కాన్సెప్ట్ పాటను విడుదలచేసారు. దేఖొరే సోదరా అంటూ సాగే ఈపాట హీరో యాక్టివిటీ నేపథ్యంలో రాబోతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అలనాడు నర్తనశాలలో అర్జునుడు అజ్ఞాతంగా వుంటూ, అంత:పుర స్త్రీలకు నాట్యం నేర్పాడు. ఈనాటి నర్తనశాలలో అమ్మాయిలకు యుద్ధవిద్యలు ఎలా నేర్పాడు అనేది కథగా తెలుస్తుంది.