దేవదాస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

నాని , నాగార్జున కలయికలో శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్లో వచ్చిన చిత్రం దేవదాస్. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకొని హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకోవడం తో సినిమా ఓపెనింగ్స్ భారీగా సాధించింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం 55% మాత్రమే పెట్టుబడి రికవరీ చేసినట్లు సమాచారం. ఇంకా పెట్టిన పెట్టుబడి మొత్తం రావాలంటే చాల టైమే పడుతుంది. కానీ ఈరోజు విజయ్ నటించిన నోటా విడుదల అవుతుంది.

విజయ్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసారు. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామి కలెక్షన్లే..ఆ టాక్ ముందు దేవదాస్ నిలబడడం కష్టమే. మరో పక్క వచ్చే వారం ఎన్టీఆర్ అరవింద సమేత తో వస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. సో దేవదాస్ ఏమైనా రాబట్టాలంటే ఈ వారమే..చూద్దాం దేవదాస్ ఏ మేరకు రాబడతాడో. ఇక మొదటి వారం ఏరియా వైజ్ ఎలా కలెక్ట్ చేసాడో చూద్దాం.

ఏరియా కలెక్షన్స్
గుంటూరు 1 కోటి 41 లక్షలు
ఈస్ట్ గోదావరి 1 కోటి 10 లక్షలు
నైజాం 6 కోట్ల 2 లక్షలు
సీడెడ్ 2 కోట్ల 24 లక్షలు
ఉత్తరాంధ్ర 2 కోట్ల 11 లక్షలు
వెస్ట్ గోదావరి 85 లక్షలు
కృష్ణ 1 కోటి 25 లక్షలు
నెల్లూరు 57 లక్షలు
సీడెడ్ 2 కోట్ల 24 లక్షలు
తెలుగు రాష్ట్రాలు 7 రోజుల షేర్ 15 కోట్ల 55 లక్షలు
రెస్ట్ అఫ్ ఇండియా 2 కోట్ల 50 లక్షలు
ఓవర్సీస్ 3 కోట్ల 25 లక్షలు
వరల్డ్ వైడ్ గా 7 రోజుల షేర్ 21 కోట్ల 30 లక్షలు