దేవి దెబ్బతీసాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ మ్యూజిక్ కు ఏమంత్రం వంక పెట్టలేం. ఆయన మ్యూజిక్ వహించాడంటే ఆ సినిమా మ్యూజికల్ గా హిట్ అవుతుందని అంత ఫిక్స్ అవుతారు. అలాంటి దేవి..సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలకు మాత్రం కనీస స్థాయి మ్యూజిక్ కూడా ఇవ్వలేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు.

సంక్రాంతి రేస్ లో చాలా కీలకంగా భావిస్తున్న వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలకు దేవి శ్రీ సంగీతం అందించాడు. ఈ రెండు చిత్రాలకు చెప్పుకోదగ్గ పాటలు ఇవ్వలేదని తెలుస్తుంది. రామ్ చరణ్ నటించిన గత చిత్రం రంగస్థలం చిత్రానికి దేవి మ్యూజిక్ ప్రాణం పోసిందని చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రానికి ఇచ్చిన మ్యూజిక్ చూసి చరణ్ ఏరికోరి బోయపాటి సినిమాకు దేవిని పెట్టుకున్నాడు. కానీ దేవి మాత్రం తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

దిల్ రాజు సైతం తన గత చిత్రం హలో గురు ప్రేమ కోసమేకి గాను దేవి ఆడియో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయినాగానీ ఎఫ్2 కు దేవిని పెట్టుకున్నాడు. ఈ చిత్ర సాంగ్స్ సైతం మామూలుగానే ఉన్నయని శ్రోతలు అంటున్నారు. ఓవరాల్ గా దేవి తన పట్టు కోల్పోతున్నాడని, మునపటి మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నాడనే ఫీడ్ బ్యాక్ వినిపిస్తుంది. మరి మహేష్ బాబుతో చేస్తున్న మహర్షి కైనా మంచి మ్యూజిక్ ఇస్తాడో లేదో చూడాలి.