దిల్ రాజు కు భయం పట్టుకుంది..

గత ఏడాది వరుస హిట్లు అందుకున్న దిల్ రాజు కు ఈ ఏడాది పెద్దగా కలిసి రావడం లేదు. నిర్మించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం తో తన ఆశలన్నీ రామ్ తో చేసిన హలో గురు ప్రేమకోసమే పైనే పెట్టుకున్నాడు. దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 18 న విడుదల కాబోతుంది. మొన్నటి వరకు ఈ సినిమా పట్ల పెద్దగా టెన్షన్ పడని దిల్ రాజు , నిన్న విడుదలైన అరవింద సమేత టాక్ తర్వాత భయం పట్టుకుంది.

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత నిన్న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది. వరుస సెలవులు కావడం , బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం తో ఇంకాస్త సినిమాకు కలిసొచ్చింది. ఈ సినిమా విజయం ఇప్పుడు హలో గురు ప్రేమకోసమే చిత్రానికి అగ్ని పరీక్షాగా మారింది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఆడియో కు , అలాగే ట్రైలర్ కు పెద్దగా స్పందన రాకపోవడం , ఇప్పుడు అరవింద కు బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో..ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని రాజు భయపెట్టుకున్నట్లు తెలుస్తుంది.

అలాగే అక్టోబర్ 18 న విశాల్ పందెం కోడి 2తో వస్తున్నాడు. ఇదీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మూవీ కావడం , ఆల్రెడీ పందెం కోడి మొదటి పార్ట్ విజయవంతం కావడంతో ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ మధ్యనే విశాల్ అభిమన్యుడు తో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మొత్తం మీద రామ్ కు గట్టి పోటీనే ఉంది. మరి రామ్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.