ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటించిన అట్లీ..

ఎన్టీఆర్ తో తమిళ్ డైరెక్టర్ అట్లీ ఓ సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండి ప్రచారం అవుతుంది. కానీ దీనికి సంబంధించి ఎవరు అధికారిక ప్రకటన చేయకపోయేసరికి నమ్మాలా..వద్దా అని డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ వార్తలు నిజమే అని డైరెక్టర్ అట్లీనే చెప్పుకొచ్చాడు.

తాజాగా ఈయన డైరెక్ట్ చేసిన బిగెల్ చిత్రం తెలుగు లో విజిల్ పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో జరుగగా..అట్లీ మాట్లాడుతూ..త్వరలోనే ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం కలదని చెప్పారు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ఖచ్చితంగా మూవీ ఉంటుంది అనే విషయం స్పష్టం ఐయ్యింది. స్టార్ హీరోలను ఒక రేంజ్ లో మాస్ ప్రేక్షకులకు దగ్గరైయ్యేలా చూపించడంలో దిట్టైన అట్లీ ఇక ఎన్టీఆర్ ని ఏరేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.