రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్న అల్లుళ్లు..

సంక్రాంతి అల్లుళ్లు లేటుగా వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం తమ సత్తా చాటుతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో సంక్రాంతి అల్లుళ్లుగా వచ్చిన వెంకీ, వరుణ్ లు ఎఫ్ 2 తో ఫుల్ గా సందడి చేస్తున్నారు. వీరి దెబ్బకు గత రికార్డ్స్ బద్దలయ్యేలా ఉన్నాయి. ఇప్ప్పటికే కొన్ని ఏరియాల్లో భరత్ అనే నేను, రంగస్థలం వంటి చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేయగా మరికొన్నింటిని బ్రేక్ చేసేందుకు దూసుకెళ్తున్నారు.

కాకినాడలో మొదటివారం షేర్స్ లో ఎఫ్ 2 భరత్ అనే నేను, రంగస్థలం, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ సినిమాలను క్రాస్ చేసి నాలుగో ప్లేస్ లోకి వెళ్ళింది.. ఇంకా అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో మరికొన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు.

అలాగే సంక్రాంతి కానుకగా వచ్చిన చరణ్ వినయ విధేయ కలెక్షన్లను కూడా తాడేపల్లిగూడెంలో ఎఫ్ 2 క్రాస్ చేసింది. ఇక ఓవర్ సీస్ తో సహా దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోవడం విశేషం. ఓవరాల్ గా ఎఫ్ 2 భారీ విజయమే సొంతం చేసుకొని అందరికి లాభాలను తెస్తుంది.