మొత్తానికి చంద్రబాబు ను పట్టించారు..

ఈ చంద్రబాబు అడ్రెస్ తెలిపినవారికి లక్ష రూపాయిలు ఇస్తానని వర్మ తెలిపిన సంగతి తెలిసిందే. అచ్చం చంద్రబాబు నాయుడును పోలిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ వీడియో చూసిన వర్మ.. ఆ వ్యక్తి వివరాలు చెప్పిన వారికి లక్ష రివార్డ్ ఇస్తానని ప్రకటించడమే కాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో అతనికి అవకాశం ఇస్తానని తెలిపాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వివరాలను రోహిత్ అనే వ్యక్తి తెలియజేసాడట. ఈ విషయాన్నీ వర్మ తెలుపుతూ.. ‘‘హే రోహిత్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ యూనిట్‌కి చంద్రబాబు నాయుడిని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో నీ పేరును తెరపై వేసి కృతజ్ఞతను చాటుకుంటా. ఇక నీ బ్యాంక్ ఖాతా వివరాలు పంపించు. లక్ష రూపాయల రివార్డ్ అందజేస్తా’’ అని తెలిపాడు.

ఈ నెల 19 న తిరుపతిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాడు. జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాలోని నటి నటుల వివరాలు ఓపెనింగ్ రోజే తెలియజేస్తారా..లేక మరోరోజా అనేది తెలియాలి.