ఫైటర్‌’ అసలు టైటిల్ కాదు


పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే ఇది అసలు టైటిల్ కాదు. వర్కింగ్ మాత్రమే. ‘‘ఈ చిత్రానికి అదిరిపోయే టైటిల్‌ను రెడీ చేశాం’’ అంటోందిఈ నిర్మాత ఛార్మి. తాజాగా ఆమె ఈ చిత్ర విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘‘పూరి జగన్నాథ్‌ ఈ కథను విజయ్‌ దేవరకొండను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారు. తొలిసారి కథ విన్నప్పుడే విజయ్‌ కూడా ఫిదా అయిపోయాడు. ఈ సినిమాలో కచ్చితంగా ఓ కొత్త విజయ్‌ దేవరకొండను చూస్తారు. సినిమాకు ‘ఫైటర్‌’ అన్నది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. కథకు తగ్గట్లుగా అన్ని భాషలకు సరిపోయేలా ఓ అదిరిపోయే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశాం. మంచి ముహూర్తం చూసి వెల్లడిస్తాం’’ అని చెప్పింది ఛార్మీ.