2018 తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా..?

2018 ఏడాది మరో రెండు రోజుల తో ముగిసిపోతుంది. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో వందల సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో బ్లాక్ బస్టర్ హిట్టైన చిత్రాలు కొన్ని మాత్రమే. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అందరూ రంగస్థలమే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అని అంటారు. కానీ ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం కాదు గీత గోవిందం చిత్రం.

‘నాన్‌-బాహుబలి’ రికార్డుతో రంగస్థలం ఈ యేడాదికి అతి పెద్ద విజయంగా నిలిచింది. అయితే పెట్టుబడిపై రాబడి చూస్తే ‘గీత గోవిందం’ పెద్ద హిట్. తక్కువ బడ్జెట్‌లో, పదిహేను కోట్ల లోపు వాల్యుయేషన్‌తో వచ్చిన ‘గీత గోవిందం’ తొలి రోజే భారీ వసూళ్లతో సర్‌ప్రైజ్‌ చేసిన ఈ చిత్రం తొలి వారాంతం తిరగకుండానే లాభాల్లోకి అడుగు పెట్టింది. వారం , వారం కలెక్షన్లు పెంచుకుంటూ పోయిన ఈ మూవీ చివరకు డెబ్బయ్‌ కోట్ల షేర్‌తో బ్లాక్ బస్టర్ విజయం గా నిలిచిపోయింది. విజయ్ క్రేజ్ , విజయ్ – రష్మిక లవ్ ట్రాక్ , గోపి సుందర్ మ్యూజిక్ , పరుశురాం టేకింగ్ ఇలా అన్ని కూడా సినిమాను పెద్ద విజయం దిశగా తీసుకెళ్లింది.