గోవిందానికి తిరుగులేదు..

అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ , ఛలో ఫేమ్ రష్మిక జంటగా సోలో ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ గీత గోవిందం’. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిన్నటి వరకు ఈ సినిమా కలెక్షన్ల ఫై కాస్త టెన్షన్ ఉండేది. ఎందుకంటే ఈ వారం శ్రీనివాస కళ్యాణం , విశ్వరూపం 2 చిత్రాలు విడుదల ఉండడం , ఈ రెండు చిత్రాల ఫై భారీ అంచనాలు నెలకొని ఉండడం తో ఈ చిత్రాల ఎఫెక్ట్ ఖచ్చితంగా గోవిందం ఫై పడుతుందని అంత అనుకున్నారు.

కానీ ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు వస్తున్న టాక్ బట్టి చూస్తే గోవిందం కలెక్షన్లకు ఏ మాత్రం తిరుగుండదని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న విడుదలైన శ్రీనివాస కళ్యాణం చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు సైతం పెద్దగా నచ్చలేదని , ఇక యూత్ అయితే ఆ థియేటర్స్ వైపు వెళ్లడం కష్టమని తేలింది.
ఇక ఈరోజు విడుదలైన కమల్ విశ్వరూపం 2 కు ప్లాప్ టాక్ బయటకు వచ్చింది. రివ్యూలు మాత్రమే కాదు పబ్లిక్ సైతం సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది , బోరింగ్ సినిమా అని , ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెపుతున్నారు. సో ఈ రెండు సినిమాల హావ ఈ రెండు రోజులే అని తేలింది.

ఇక ఆగస్టు 15 న రాబోతున్న గీత గోవిందం కలెక్షన్లకు ఎదురులేదని అంత భావిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్స్ , ఆడియో మొత్తం కూడా చిత్రానికి పాజిటివ్ టాక్ ను తెచ్చాయి. దీంతో సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాస్త బాగున్నా కానీ సినిమా కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండబోతాయని ఖచ్చితం గా చెప్పొచ్చు.