గీత బరువు మోస్తున్న గోవిందం..

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్నా జంటగా పరుశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. ఇటీవలే విడుదలైన ‘ఇకేం ఇకేం ఇకేం కావాలే’ అనే సాంగ్‌ యూట్యూబ్ లో ఎలాంటి వ్యూస్ సాధించిందో తెలియంది కాదు. ఈ ఒక్క సాంగ్ తో సినిమా ఎంత బజ్ రావాలో అంత వచ్చేసింది. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ నెల 22న (ఆదివారం) ఉదయం 11:22 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా టీజర్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సదర్భంగా విజయ్ ట్విట్టర్ ద్వారా ‘ఐ లవ్ హెర్ బరువు బాధ్యత’ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టర్‌లో గోవిందం లుంగీ మడిచి కట్టిమరీ.. గీతను గుర్రం ఎక్కించుకుని తేలికైన, భారం కాని గీత బరువును అలవోకగా మోస్తుంటే.. వెనుక నుండి గీత.. గోవిందాన్ని గట్టిగా కౌగిలించుకుని ఉండటం సినిమా ఫై ఇంకాస్త క్రేజ్ ను తీసుకొస్తుంది. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోలో మూవీ ఫేమ్ పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.