యాక్షన్ స్టార్ట్ చేసిన ప్లాప్ హీరో

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి కథలతో వచ్చిన హిట్ మాత్రం పడడం లేదు. కనీసం ఈయన సినిమాలు పబ్లిసిటీ ఖర్చులు కూడా తెచ్చుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంపత్ నంది డైరెక్షన్లో ఓ స్పోర్ట్స్ మూవీ చేస్తున్నాడు.

ఇందులో గోపి ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తుండగా..తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ..ఈరోజు షూటింగ్ మొదలుపెట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.