రేపు ఉదయం గం.11.11 నిమిషాలకు గణ369 ట్రైలర్

 

టాలీఅంవుడ్ లో ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయమైన హీరో కార్తికేయ. ఈ హీరో ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చేసిన హిప్పీ అంతగా రక్తి కట్టలేదు. హిప్పీ తర్వాత ఈ హీరో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో గుణ 369 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మూవీ  టీజర్ కొద్దీ రోజుల క్రితం రిలీజ్ చేయగా… సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బుజ్జి బంగారం అనే లిరికల్ సాంగ్ ను కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు.

అదేవిధంగా సినిమా ప్రచారంలో భాగంగా రేపు బుధవారం అంటే.. జులై 17 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఆగష్టు 2 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అదే రోజున బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతున్న విషయం కూడా తెలుసిందే.