హను తో విజయ్..?

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవపూడి..మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందాడు. నాని కెరియర్ ను టర్న్ చేసిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ తో పడిపడి లేచే మనసు సినిమా చేసాడు హను. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ కొట్టింది. ఈ సినిమా తర్వాత చాలామంది నిర్మాతలు , హీరోలు హను తో సినిమా చేసేందుకు కాస్త వెనుకడుగు వేశారు. కానీ తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ..హను తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మిలటరీ బ్యాక్ డ్రాప్ తో కూడిన లవ్ స్టోరీ ని రాసుకొని విజయ్ కి వినిపించాడట హను. ఈ కథ విన్న విజయ్ వెంటనే ఓకే చెప్పాడని..దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాలి. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రం తో జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనితో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో ఓ సినిమా..తమిళ్ డైరెక్టర్ ఆనంద్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు.