హలో గురు ప్రేమకోసమే సెన్సార్ రిపోర్ట్..

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. `సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 18 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సందర్భాంగా చిత్ర సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు క్లీన్ ‘యూ ‘ సర్టిఫికెట్ జారీ చేసారు. ఫిల్ గుడ్ గా సినిమా తెరకెక్కిందని , నటి నటులు బాగా చేసారని , చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయని తెలియజేసారు. ఈ చిత్రానికి విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు.బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు.. ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు.