హుషారు కు అదే మైనస్..

ఇటీవల ఎంత పెద్ద స్టార్ హీరో సినిమానైనా..ఎంత పెద్ద దర్శకుడి సినిమానైనా ప్రమోషన్ అనేది తప్పనిసరి..చేసే ప్రమోషన్ బట్టే జనాలు థియేటర్స్ వైపు చూస్తున్నారు తప్ప లేదంటే కానీ ఆ సినిమా గురించి మాట్లాడుకోవడమే చేయడమే లేదు. అలాంటిది హుషారు విషయం లో మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయకుండా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. చిత్ర యూనిట్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ ఎఫెక్ట్ చిత్ర వసూళ్ళపై ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగం చేయకుండా ఏదైనా స్వంతంగా వ్యాపారం చేసి తమ కాళ్ళ మీద నిలబడాలి అనే నలుగురు ఇంజనీరింగ్ కుర్రాళ్ళ లైఫ్ ని సరదాగా చూపించిన తీరు యువతను బాగా ఆకట్టుకుంటోంది.

సినిమాను చూసిన వారంతా సినిమా బాగుందని చెపుతున్నారు..కాకపోతే కేవలం యూత్ మాత్రమే థియేటర్స్ కు వెళ్తున్నారు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లడం తో..అసలు వారికీ ఈ సినిమా రిలీజ్ అయినా విషయం కూడా తెలియదు. ప్రస్తుతం ఏ సెంటర్స్ మాత్రమే నిండుతున్నాయి తప్ప బి, సి సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ లేదు. ఇప్పటికైనా చిత్ర యూనిట్ మేల్కొని ప్రమోషన్ చేస్తే సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని సినీ వర్గాలు చెపుతున్నాయి.