హైపర్ ఆది కి ఆక్సిడెంట్..?

హైపర్ ఆది ఈయన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హైపర్ ఆదినే. ఆయన వేసే పంచ్ డైలాగులకు పగలబడి నవ్వనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈయన కొన్ని వారాలుగా జబర్దస్త్ షో లో కనిపించకపోయేసరికి ఈయనకు ఏమైందో అనే చర్చ అందరిలో మొదలుఅయ్యింది. ఈ నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ చానెల్స్ హైపర్ ఆదికి యాక్సిడెంట్ అయ్యిందని, నాగబాబుతో పాటు జబదర్దస్త్ టీం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో అంత నిజమే అనుకున్నారు.

కానీ తనకు ఎలాంటి ఆక్సిడెంట్ జరగలేదని , తాను ఆరోగ్యం గా హ్యాపీ గా ఉన్నానని తెలియజేసి అభిమానుల్లో సంతోషం నింపారు. మంగళవారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేసాడు ఆది. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తనకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక చెత్త న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని, తాను బాగానే ఉన్నానని ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆది చెప్పారు. పుకార్లు నమ్మొద్దని, తాను చాలా బాగున్నానని వెల్లడించారు. అంతేకాకుండా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.