‘బాహుబలి’ని నిలబెట్టిన ‘సాహో’

యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా ఆల్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అంతకుముందు టాలీవుడ్‌లో లేడీ ఫ్యాన్‌ పాలోయింగ్‌ బాగా ఉన్న హీరో అయిన ప్రభాస్‌ ఒక్కసారిగా పలు భాషల్లో సైతం అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక తెలుగులో అయితే ఏ భారీ చిత్రం విడుదలయిన వాటిని బాహుబలి, నాన్‌ బాహుబలి రికార్డులు అంటూ ఆ సినిమాతో పోల్చుతారు. భారీ విజయం తర్వాత ప్రభాస్‌ కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి హిట్‌ పడాలని ప్లాన్‌ చేశాడు. దాని ఫలితం ‘సాహో’ చిత్రీకరించబడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను నిరాశ పర్చింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న ‘సాహో’ టాలీవుడ్‌ మాత్రం అంతగా సక్సెస్‌ అవలేదని చెప్పవచ్చు.

తెలుగులో పెద్దగా ఆడకపోయినా కూడా హిందీలో మాత్రం ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్‌లో 150కోట్లను వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో ఈ చిత్రం హిట్‌గా నిలిచిందని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల వారు ప్రకటించారు. ఇదివరకు ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతోనే అక్కడ మంచి పేరును సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆ పేరును అలాగే నిలబెట్టింది ‘సాహో’. తెలుగు లాగే హిందీలో కూడా ఈ చిత్రం పరాజయం అయితే అక్కడ ప్రభాస్‌కు భారీ నష్టమే జరిగేది. ఇక్కడ ఫ్లాప్‌ అయినా ప్రభాస్‌కు ఒరిగే నష్టం లేదు ఎందుకంటే ప్రభాస్‌పై అంత నమ్మకం. కానీ అక్కడ ఫ్లాప్‌ అయితే హిందీలో మళ్లీ సినిమాలు చేస్తే ఆ ప్రభావం చాలా పడుతుంది. కాబట్టి ఎట్టకేలకు ‘బాహుబలి’ క్రేజ్‌ను ‘సాహో’ నిలబెట్టిందని చెప్పవచ్చు.