ఐశ్వర్యా రాజేష్ కి బంపర్ ఆఫర్


ద‌ర్శ‌కుడు శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ మూవీ ‘ఇండియన్ 2’. ఈ సినిమా ఆగిపోయిందని కొన్నాళ్ళగా ప్రచారం జరుగుతుండగా అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు, ఎన్నికల కోసం కమల్ హసన్ బ్రేక్ తీసుకోగా ఇప్పుడు ఎన్నికల సీజన్ అయిపోవడంతో మళ్ళీ ఈ సినిమా తెరకెక్కించే పనిలో పడ్డారని అంటున్నారు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేశారట. ఈమెతో పాటు తమిళ నటి ప్రియ భవాని శంకర్ ని కూడా సెలెక్ట్ చేశారని అంటున్నారు. ప్రాయ సిద్దార్ద్ సరసన కనిపించనుందని అంటున్నారు. ఐశ్వర్య పాత్ర మీద క్లారిటీ లేకున్నా ఆమె అక్టోబర్ నుండి షూట్ లో పాల్గొననుందని అంటున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో అవకాశం అంటే ఐశ్వర్యకు జాక్ పాట్ తగిలినట్టే.

ఇదిలా ఉంటే ఐశ్వర్య చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. నాలుగు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో నాలుగు చిత్రాలను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా తెలుగులో ‘మిస్ మ్యాచ్’ తో పాటు ‘కౌసల్య కృష్ణ మూర్తి’ విజయ్ దేవరకొండతో సినిమాలు కూడా ఉన్నాయి.