ఇర్ఫాన్ పఠాన్ కోబ్రా లుక్ చూసారా..?

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు డైరెక్టర్ అజయ్‌ జ్ఞానముతు. నిన్న(​అక్టోబర్ 27)న ఇర్ఫాన్‌ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దర్శకుడు అజయ్‌ మంగళవారం ట్వీట్‌ చేస్తూ ఇర్ఫాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

అంతేగాక ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్‌ పాత్ర పేరును వెల్లడించాడు. ఇందులో ఇర్ఫాన్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తూ.. ‘డియర్‌ ఇర్ఫాన్ సార్‌ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్న. మీలాంటి గొప్ప వ్యక్తితో కలిసి పని చేయడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే అస్లాన్‌ యిల్మాజ్‌’ అంటూ ఆయన ట్వీట్‌ చేశాడు. ఈ పోస్టర్‌లో ఇర్ఫాన్‌ బ్లాక్‌ సూట్‌ ధరించి స్టైలిష్‌గా కనిపించాడు.