రివ్యూ -ఇస్మార్ట్ శంకర్ (  రోటీన్ కమర్షియల్ విత్ పూరీ మార్క్)

రివ్యూ -ఇస్మార్ట్ శంకర్  – రోటీన్ కమర్షియల్ విత్ పూరీ మార్క్
స్టార్ కాస్ట్ : రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, జాయ్ బద్లాని, సత్యదేవ్ కాంచరాన, తనికెళ్ళ భరణి
దర్శకత్వం : పూరీ జగన్నాధ్
నిర్మాతలు: పూరీ- ఛార్మీ
మ్యూజిక్ : మణి శర్మ
విడుదల తేది : జూలై 18, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా టీజర్స్ , ట్రైలర్స్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్, హీరో ఎంతో శ్రమకోర్చి తీసిన ఈ చిత్రం అంచనాలను అందుకుందా ? ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం..

శంకర్‌ (రామ్‌ పోతినేని) ఓల్డ్ సిటీలో సెటిల్మెంట్స్‌ చేసే ఉస్తాద్. ఓ సెటిల్మేంట్ లో పరిచయం అయిన చాందిని (నభా నటేష్)తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే పొలిటీషియన్‌ కాశీ రెడ్డిని చంపిన కేసులో జైలుకు వెళతాడు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్‌ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంది సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌).ఆ చిప్ ని అమ‌ర్చిన క్ర‌మంలోనే మెద‌డుపై ప‌రిశోధ‌కురాలిగా నిధి ప‌రిచ‌యం అవుతుంది. అయితే అసలు శంకర్‌ మెదడులో మరో వ్యక్తి జ్ఞాపకాలను ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.? పొలిటీషియన్ కాశీరెడ్డిని శంకరే చంపాడా? ఇంకెవరైనా చంపి శంకర్ ని ఇరికించారా ? శంకర్‌కి సీబీఐ ఆఫీసర్‌ అరుణ్‌ (సత్యదేవ్‌)కి సంబంధం ఏంటి? అసలు ఇలా చేయడంలో సీబీఐ టార్గెట్ ఏంటి? అనేది వెండి తెర మీద చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌ :

* రామ్‌ పోతినేని పర్ఫామెన్స్‌
* మాస్ ఎలిమెంట్స్‌
* మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
* ఎంచుకున్న లైన్
* రామ్ యూనిక్ స్టైల్ .. ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్

మైనస్‌ పాయింట్స్‌ :

* రొటీన్ కమర్షియల్ కథనం
* కథ
* బోరింగ్ స్క్రీన్ ప్లే

విశ్లేషణ :

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్‌ సినిమా చేశాడు. గత సినిమాల తరహాలో కాకుండా ఈ సినిమాని మనసుపెట్టి సినిమాను తెరకెక్కించినట్టుగానే అనిపించింది. కానీ ప్రస్తుత ప్రయోగాత్మక చిత్రాల కాలంలో పక్కా రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పూరి. ఓ పాట, ఓ ఫైట్ అన్న ఫార్ములానే నమ్ముకుని ఈ సినిమా తెరకెక్కించాడు. సినిమా మొదట్లో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా సరైన టేకింగ్ లేక ప్రేక్షకుడు గజిబిజి ఫీల్ అవుతాడు. మెదడులోని జ్ఞ్యాపకాలను మార్చడం అనే అంశం కాస్త కొత్తగా అనిపించినా దానిని కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో పూరి విఫలం అయ్యారనే చెప్పాలి. మాఫియా క‌థ‌ల‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. వాటి త‌ర‌హాలోనే వచ్చిన పూరీ మార్క్ సినిమా ఇది. క్లైమాక్స్ ను సైతం ఊహించేసేంత సింపుల్ గా తీర్చిదిద్ద‌డంతోనే సినిమా పూర్తిగా తేలిపోయింది.

పెర్ఫార్మెన్స్ :

రామ్ ఓ ర‌కంగా హైదరాబాదీ మాస్ లుక్ లో, తెలంగాణా యాసతో వన్ మేన్ షో చేశాడు. అంతేకాకుండా క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. అలాగే ఈ చిత్రంలో సత్యదేవ్ కు ఇచ్చిన ఓ కీలక పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. షియాజీ షిండే కూడా సినిమా చివరి వరకు సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకుంటారు. టెక్నిషియన్స్ విషయానికి వచ్చినట్టయితే రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు మణిశర్మ పాటల గురించి చెప్పుకునే తీరాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
మొత్తానికి పూరీ సినిమా మీద ఏర్పడిన అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
రోటీన్ కమర్షియల్ విత్ పూరీ మార్క్

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5