సినీ ప్రముఖులను టార్గెట్ చేసారా..?

ఐటీ దాడులు ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ను అతలాకుతలం చేసింది..బుధువారం ఉదయం ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తో పాటు హీరో నాని ఇంట్లో ఆఫీస్ లలో ఐటీ దాడులు నిర్వహించారు. రీసెంట్ గా నాని ప్రొడ్యూసర్ గా అవతారమెత్తిన సంగతి తెలిసిందే. హీరోగా చేస్తూనే నిర్మాతగా అవతారమెత్తడం తో ఐటీ అధికారులు ఈయన ఫై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

అలాగే దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు చేసారు. ఇలా ఒకేసారి ఇండస్ట్రీ ఫై ఐటీ కన్నుపడడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఇంకెవరెవరి ఫై ఐటీ దాడులు జరుగుతాయో చూడాలి.