విరూపాక్ష లో జాక్వెలిన్ రోల్ ఏంటి అంటే..

విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించే డైరెక్టర్ క్రిష్…పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ 27 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన శాతకర్ణి , మణికర్ణిక చిత్రాలు హిట్స్ కాగా…ఇప్పుడు పవన్ తో కూడా అదే తరహా కథ తో సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. దీనికోసం భారీ సెట్స్ ప్లాన్ చేసారు. అయితే ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఒకరు జాక్వెలిన్ . సినిమాలో ఆమె యువరాణిగా కనిపిస్తుందట. ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే ఎమోషనల్ సీక్వెన్స్ సినిమాలోనే కీలకం అని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి.