రూ.10 వేల పెన్షన్‌ .. జగన్ ప్రకటన

కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు, తలసేమియా రోగులకు నెలకు రూ.10 వేల ఆర్థిక వేల సాయం చేయనున్నట్టు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. జనవరి 1 నుంచి వారికి రూ.10 వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. ప్రతి నెల రూ.10వేలు అందుతుందన్నారు.

వైఎస్ఆర్ కంటి వెలుగు పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. త్వరలో 432 కొత్త 108 వాహనాలను ప్రారంభిస్తామన్నారు. 676 కొత్త 104 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డిసెంబర్ 21 నుంచి ఏపీలో కొత్త ఆర్యోశ్రీ కార్డులు ఇస్తామని సీఎం చెప్పారు. వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు.

Comments