‘జెర్సీ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

అంత అనుకున్నట్లే నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా నిరూపించాడు. గత ఏడాది రెండు ప్లాప్స్ పడేసరికి అందరూ నాని సెలక్షన్ ఫై నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కానీ జెర్సీ తో నాని సెలక్షన్ సూపర్ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు. ‘జెర్సీ’ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6.88 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి వీకెండ్ కలెక్షన్స్ చూస్తే.. రూ. 10.71 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను సాధించిందని.. మిగతా ఏరియాలతో పోలిస్తే నైజామ్ లో చాలా స్ట్రాంగ్ గా సాగుతోంది. ఒక నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా దాదాపు 5 కోట్ల షేర్ వసూలు చేయడం గమనార్హం.

ఇక మిగతా ఏరియా వైజ్ చూస్తే…

నైజామ్: 4.90 కోట్లు

సీడెడ్: 1.03 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.30 కోట్లు

కృష్ణ: 0.78 కోట్లు

గుంటూరు: 0.83 కోట్లు

ఈస్ట్ : 0.85 కోట్లు

వెస్ట్: 0.65 కోట్లు

నెల్లూరు: 0.37 కోట్లు

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 10.71 కోట్లు