రాధేశ్యామ్ చిత్రానికి ఎవరు మ్యూజిక్ డైరెక్టరో తెలిస్తే షాక్ అవుతారు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో రాధే శ్యామ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని టీ సిరీస్‌ బ్యానర్స్‌ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడగా..తాజాగా కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టడం తో మళ్లీ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇటలీ లో ఉంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఎవరు మ్యూజిక్ అందిస్తున్నారనేది సస్పెన్స్ గా మారిన సంగతి తెలిసిందే. సినిమా తాలూకా అనేక విశేషాలు బయటకు వస్తున్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది చిత్ర యూనిట్ ప్రకటించకపోయేసరికి అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

ఈ చిత్రానికి అసలు ఎవరూ ఊహించని మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఇవ్వనున్నాడు. అతడే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జస్టిన్ ప్రభాకర్. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” కు మాత్రమే కంపోజ్ చేసాడు. కానీ మళయాళం మరియు తమిళ్ లో ఎన్నో చిత్రాలకు మంచి మ్యూజిక్ ను అందించాడు. మరి ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియన్ సినిమాకు కూడా సంగీతం ఇవ్వని ఈ దర్శకుడుపై ఎంత నమ్మకం లేకపోతే ఇలాంటి తరహా ప్రాజెక్ట్ ను అందించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.