బిచ్చగాడు ఫేమ్ విజయ్ ‘జ్వాల ‘ ఫ‌స్ట్ లుక్‌..

విజయ్ ఆంటోని ..అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ బిచ్చగాడు చిత్ర హీరో అంటే అందరికి టక్కున గుర్తువస్తుంది. అంతలా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా విజయం సాధించలేకపోయారు. తాజాగా ఇప్పుడు జ్వాల చిత్రం తో రాబోతున్నాడు.

తెలుగు, త‌మిళ భాషల్లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎం డైరెక్ట్ చేస్తున్నాడు. అరుణ్ విజ‌య్ కీ రోల్ పోషిస్తున్నాడు. కోల్‌క‌తాలో ఈ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. లాంగ్ హెయిర్ స్టైల్ తో త‌లుపు తీసి బ‌య‌ట‌కొస్తున్న‌ట్టుగా కనిపిస్తున్న స్టిల్ స‌స్పెన్స్ గా ఉంది. అమ్మ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై టీ శివ నిర్మిస్తున్నారు. జ్వాల‌లో నాజ‌ర్‌, అక్ష‌ర హాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.