జ్యోతిక ఎంత గొప్ప పనిచేసిందో తెలుసా..?

తమిళ్ హీరో సూర్య భార్య , నటి జ్యోతిక తన గొప్ప మనసు చాటుకుంది. తంజావూర్‌ ప్రభుత్వాస్పత్రికి రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్‌ కోసం రాజా మీరసుధార్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్‌.శరవణన్‌ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు.