అర్జున్ రెడ్డి హీరోను అంత అవమానిస్తారా..?

అర్జున్ రెడ్డి హీరో అనగానే మన విజయ్ దేవరకొండ అనుకోకండి..అర్జున్ రెడ్డి చిత్ర రీమేక్ లో నటించిన షాహిద్ కపూర్ గురించి..రీసెంట్ గా కబీర్ సింగ్ తో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు రూ. 300 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించాడు. అలాంటి ఈ హీరో కు అవార్డు ఇస్తామని పిలిచి ఇవ్వకుండా అవమానించారట.

ఈ మధ్యే 2019 అవార్డ్స్ పేరుతో ముంబైలో ఓ భారీ ఈవెంట్ జరిగింది. అందులో షాహిద్ కపూర్‌కు అవార్డు ఇస్తామని హింట్ ఇచ్చి.. తీరా ఆయన వచ్చిన తర్వాత హ్యాండిచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కబీర్ సింగ్ తో షాయిద్ క్రేజ్ విపరీతం అయ్యింది. దీనిని క్యాష్ చేసుకుందామని సదరు ఈవెంట్ వారు మీకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తామని..కాకపోతే మీరు వేదిక ఫై డాన్స్ చేయాలనీ కోరారు.

ఆయన కూడా దానికి ఓకే అన్నాడని.. కానీ చివరి నిమిషంలో షాహిద్ కాకుండా మరో నటుడికి బెస్ట్ యాక్టర్ ఇవ్వడం షాహిద్ కు బాగా కాలిందట. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఈవెంట్ మేనేజర్స్ ఫై మండిపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.