కల్కి థియేటర్ రైట్స్ ఎంతో తెలుసా..?

‘గరుడవేగ’ తో హిట్ అందుకున్న యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ‘కల్కి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ 1983 నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా తెలుస్తుంది. ఆహుతి, అంకుశం, మగాడు తరహాలోనే ఈ కల్కి కూడా పూర్తి స్థాయి యాక్షన్ ఎంటెర్టైనర్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఇటీవల రిలీజ్ యినా ట్రైలర్ లు సైతం ఆకట్టుకోవడం తో థియేటర్ రైట్స్ విషయంలో పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో నిర్మాత రాధా మోహన్ ఈ సినిమాను12 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమా మీద తమిళ క్రేజీ హీరో ధనుష్ కూడా ఆసక్తిగా వుండడం. ఆయన ఈ సినిమాతో తెలుగు మార్కెట్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.

ఆయన తన వండర్ బార్ సంస్థను టాలీవుడ్ లో కూడా విస్తరించాలనుకుంటారు. అందుకే ఆయన కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆయన తన వండర్ బార్ సంస్థ కోసం ఈ సినిమా ఇండియా వైడ్ థియేటర్ రైట్స్ కావాలని అడుగుతున్నట్లు బోగట్టా. అయితే ఇప్పటికే రాధామోహన్ కు అగ్రిమెంట్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.