మెగా హీరోకు జోడిగా ఐరెన్ లెగ్ బ్యూటీ..?

మజ్ను చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఎన్నారై బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌..మొదటి సినిమా తోనే హిట్ అందుకునే ఇండస్ట్రీ కళ్లు తనపై పడేలా చేసుకుంది. ఆ తర్వాత వరుస అగ్ర హీరోల పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది కానీ హిట్స్ మాత్రం వేసుకోలేకపోయింది. “ఆక్సీజ‌న్”.. “అజ్ఞాత‌వాసి”.. “నా పేరు సూర్య” సినిమాలు భారీ డిజాస్ట‌ర్స్ అయ్యాయి. దీంతో అను పని అయిపోయిందని అంత అనుకున్నారు. ఈ లోపు శైలాజా రెడ్డి అల్లుడు ఆఫర్ రావడం తో దీనిపై భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ కావడం తో అమ్మడిని ఐరెన్ లెగ్ గా తేల్చేసారు.

ఈ సినిమా తర్వాత మరో ఆఫర్ అమ్మడి తలుపు తట్టలేదు..ఈ నేపథ్యంలో మెగా హీరో పక్కన ఛాన్స్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మెగా వారల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించబోయే రెండో సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ లో ముందుగా ప్రియా వారియర్‌ను అనుకున్నారు కానీ ఆమె పారితోషికం చూసి భయపడి, ఆమెకు బదులు అనుకు ఈ ఆపర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. పులివాసు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్‌లోనే మొదలు కానుంది. మరి ఈ ఐరెన్ లెగ్ బ్యూటీ జాతకం కళ్యాణ్ మారుస్తాడో చూడాలి.