సర్కార్ కు లోకనాయకుడు సపోర్ట్..

విజయ్ – మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన సర్కార్ చిత్రం కలెక్షన్ల వర్షమే కాదు..వివాదాల వర్షం కూడా కురిపిస్తుంది. ముఖ్యంగా అన్నాడీయంకే పార్టీ నేతలైతే ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో చాల సన్నివేశాలను తమ పార్టీని దెబ్బె తీసేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ డైరెక్టర్ మురుగదాస్, హీరో విజయ్ ల దిష్టి బొమ్మలు కాలుస్తూ తమ నిరసనలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో లోకనాయకుడు కమల్ హాసన్ సర్కార్ కు మద్దతు తెలిపారు. చట్టబద్ధంగా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలైన సినిమాలపై అక్రమంగా ఒత్తిడి తేవడం ఈ ప్రభుత్వానికి కొత్తేం కాదని వ్యాఖ్యానించారు. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేని ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని చెప్పడంతో ఇంకాస్త హాట్ టాపిక్ అయ్యింది. కొంతమంది కమల్ సపోర్ట్ ను స్వీకరిస్తే , మరికొంతమంది మాత్రం చల్లారుతున్న గొడవను ఇంకాస్త పెంచాడే అని మాట్లాడుకుంటున్నారు.