కేజీఎఫ్‌ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

కేజీఎఫ్‌..ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో డబ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేయగా ..యష్ హీరోగా నటించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా చాప్ట‌ర్ 2ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మధ్యనే ఫ‌స్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్ర‌ని సస్పెన్స్‌లో పెట్టిన మేక‌ర్స్ ఆ పాత్ర‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేసి ఆకట్టుకోగా..ఇక ఇప్పుడు అసలు సిసలైన ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబ‌ర్ 21 సాయంత్రం 5.45ని.ల‌కి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. శ్రీనిధి శెట్టి చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట.