కైరా నుండి ముద్దులే ముద్దులు..

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన కైరా అద్వానీ..మొదటి సినిమాతోనే ఆడియన్స్ బాగా ఆకట్టుకొని , వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో పాటే బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ భామ పలు హిందీ సినిమాలు చేసినప్పటికీ వెబ్ సిరీస్ తో బాగా క్రేజ్ తెచ్చుకుంది. హాట్ & బోల్డ్ సన్నివేశాల్లోను అమ్మడు రెచ్చిపోయి నటిస్తుండడం తో అమ్మడికి అలాంటి బోల్డ్ రోల్స్ ఎక్కువగా తలుపు తడుతున్నాయి.

ప్రస్తుతం ఈ భామ తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తుంది. తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ వంగానే హిందీ లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు కంటే ఘాటైన రొమాన్స్, కిస్సింగ్ సన్నివేశాలు హిందీలో ఎక్కువగా చూపించబోతున్నారట. ఆ సన్నివేశాల్లో కైరా అదరగొడుతుంది, ఏ మాత్రం మొహమాటం పడకుండా రెచ్చిపోయి ఆ సన్నివేశాల్లో నటిస్తుండడం తో ఆ సీన్లు అనుకున్న దానికంటే ఇంకా బాగా వస్తున్నాయని చిత్ర యూనిట్ చెపుతున్నారు. వెండితెర ఫై ఆ సన్నివేశాలు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయని చెపుతున్నారు. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కైరా ముద్దుల్లో మునిగేందుకు సిద్ధంగా ఉండండి.