సమజవరగమన మరో కొలవెరి అవుతుందా ?

సినిమా విడుదలకు ముందే పాటలు వస్తాయి. అందులో కొన్ని పాటలు ఊపేస్తాయి. తీరా పాట చూసిన తర్వాత అంత మేటర్ వుండదు. కొలవెరి పాట ఈ వరసలోకే వస్తుంది. పాట మేకింగ్ వీడియో, ట్యూన్ పిచ్చ పాపులర్. కానీ సినిమాలో మాత్రం తేలిపోయింది. బీచ్ లో బాటిల్స్ పట్టుకొని గెంతడం తప్పితే ఏమీ లేదు ఆ పాటలో.

ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ అల … సినిమా పాట ‘సమజవరగమన’ కూడా అంతే. కవర్ సూపర్ హిట్. అయితే కొద్ది సేపటిక్రితం పాట ప్రోమో వదిలారు. ఈ ప్రోమోలో మేటర్ లేదు. ఈఫిల్ టవర్ టవర్ దగ్గర ఆ పాటని ఓ సింగర్ లా పడుతున్నాడు బన్నీ. పూజా కామన్ గా వయ్యారులు పోతుంది. అంతా స్లో మోషన్ లో ఓ రెండు స్టెప్పులు వేశాడు బన్నీ. అంతకుముంచి మెరపులు కనిపించలేదు. ఈ పాట కోసం చాలా ఖర్చుపెట్టారట. ఈఫిల్ టవర్ తప్పితే ఇంకేం కనిపించడం లేదు. చూడాలి సినిమాలో పాట ఎలా వుటుందో..