బాక్స్ ఆఫీస్ కాంచన – చిత్రలహరి – జెర్సీ కలెక్షన్స్..

అసలైన సినిమా పండగా ఏప్రిల్ నెల తీసుకొచ్చింది..జనవరిలో నెలలో కళకళలాడిన థియేటర్స్ మళ్లీ ఏప్రిల్ నెలలో ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఈ నెలలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ సూపర్ హిట్స్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మజిలీ , చిత్రలహరి , కాంచన 3 చిత్రాల కలెక్షన్లు చూస్తే..

ఏప్రిల్ 12న విడుదలైన సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి బాక్సాఫీస్ వద్ద కృష్ణ జిల్లాలో మొత్తం 10 రోజులకు గానూ 74.99 లక్షల షేర్ ను రాబట్టింది. ‘కాంచన 3’ మాత్రం కృష్ణా జిల్లాలో కేవలం మూడు రోజులకుగానూ రూ. 69.20 లక్షల షేర్ ను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. చిత్రలహరి పది రోజుల కలెక్షన్స్ కు, కాంచన 3 మూడు రోజుల కలెక్షన్స్ కు కేవలం నాలుగు లక్షలే తేడా కావడం విశేషం.

ఇక ‘జెర్సీ’ కూడా ‘కాంచన 3’తో పోటీ పడాల్సిన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే.. కృష్ణా జిల్లాలో జెర్సీ మొదటి మూడు రోజులకుగానూ రూ. 76.79 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ‘కాంచన 3’ కలెక్షన్స్ కంటే.. ఒక్క ఏడు లక్షలు ఎక్కువ అంతే. మొత్తానికి కృష్ణా జిల్లాలో బాక్సాఫీస్ వద్ద ‘కాంచన 3’తో అన్ని చిత్రాలకు మంచి పోటీ ఇస్తుంది.