లక్ష్మి దెబ్బకు సూర్యకాంతం తట్టుకోగలదా..?

2019 స్టార్టింగ్ సినిమా ప్రియులను బాగా నిరాశ పరిచింది…సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు రావడం తో పండగ చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం తప్ప మారే ఏ చిత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక సంక్రాంతి తర్వాత ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన సినిమానే రాలేదు..చెప్పుకోడానికి ఇండస్ట్రీ లో చాలామంది హీరోలే ఉన్నప్పటికీ ఎవరు కూడా రాలేకపోయారు. దీంతో సినీ ప్రేక్షకులంతా ఓ పెద్ద..క్రేజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం రెండు క్రేజీ చిత్రాలు లక్ష్మిస్ ఎన్టీఆర్ తో పాటు మెగా డాటర్ నిహారిక నటించిన సూర్యకాంతం సినిమాలు విడుదల అవుతున్నాయి.

వర్మ తెరకెక్కించిన లక్ష్మి స్ ఎన్టీఆర్ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో మాటల్లో చెప్పలేం..ఆ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవ్వరు నటించలేదు..కాకపోతే నందమూరి తారకరామారావు చివరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కడం..ఎన్నికల సమయంలో ఆ సినిమా రిలీజ్ అవడం..సినిమా ప్రచార ప్రమోషన్లు ఓ రేంజ్ లో జరగడం తో సినిమాపై భారీ ఎత్తున అంచనాలు నెలకొని ఉన్నాయి. వాస్తవానికి గత వారమే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ సమస్య కారణం గా ఈ వారానికి వాయిదా పడింది.

ఇక నిహారిక నటించిన సూర్యకాంతం విషయానికి వస్తే..మెగా హీరోయిన్ గా నిహారిక ఇండస్ట్రీ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అమ్మడికి మాత్రం కలిసిరావడం లేదు. చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ కావడం తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. నిహారిక.. రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కగా..షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత్ ఈ చిత్రంతో వెండితెరకు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్వాణ సినిమాస్ బ్యానర్ వారు నిర్మించగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పించడం తో ఈ సినిమాను చూడాలని మెగా ఫ్యాన్స్ ఆత్రుత గా ఉన్నారు. మరి లక్ష్మి ముందు సూర్యకాంతం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.