విజయ్ ‘లైగర్ ‘ బడ్జెట్ ఎంతో తెలుసా..?

పూరి – విజయ్ దేవరకొండ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కి తెలుగు తో పాటు హిందీ లోను మంచి పాపులార్టీ ఉండడం తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కామ్ డిస్ట్రబ్యూటర్ కరణ్ జోహార్ హిందీ లో ఫైటర్ ను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కాగా ఈ చిత్రానికి మొన్నటి వారికి ఫైటర్ అనే టైటిల్ ప్రచారం కాగా..ఇప్పుడు మాత్రం ఈ చిత్రానికి లైగర్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటనే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

కాగా ఈ చిత్రానికి దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేస్తున్నారట. విజయ్ కెరీర్లో మొదటిసారి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే. తెలుగుతో పాటు హిందీలో కూడ రూపొందుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు.