పబ్లిక్ టాక్ : ”లవర్స్ డే ” – లవర్స్ అస్సలు మిస్ కావొద్దు

ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలన రేపిన ప్రియా ప్రకాశ్ వారియర్, రావూఫ్ రోషన్ జంటగా నటించిన ”లవర్స్ డే ”(మలయాళంలో ఒరు ఆడార్ లవ్) చిత్రం తెలుగు, మలయాళంతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో ప్రేమికుల రోజున సందర్భాంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై అందించారు.

మరి కన్నుగీటు తో సంచలనం సృష్టించిన ఈ భామ మొదటి సినిమాతో ఏ రేంజ్ లో అదరగొట్టింది..అసలు లవర్స్ డే రోజు అమ్మడు ఏ రేంజ్ లో ప్రేమ కురిపించింది..ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

ఈ సినిమా ను చూసిన ప్రేక్షకులు సినిమా చాల రొమాంటిక్ గా ఉందని , ప్రియా అందర్నీ కట్టిపడేసింది, ఆమెకు మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో సీనియర్ భామ గా అదరగొట్టింది చెపుతున్నారు. గ్లామర్ పరంగానే కాకుండా, నటన తో కూడా ఆకట్టుకుందని చెపుతున్నారు. రాబోయే రోజుల్లో అమ్మడు అన్ని ఇండస్ట్రీలలో బిజీ హీరోయిన్ కావడం ఖాయమని చెపుతున్నారు.

అలాగే రావూఫ్ రోషన్ యాక్టింగ్ కూడా బాగుందని , ప్రియా – రావూఫ్ రోషన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ను యూత్ ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చని , మరోసారి స్కూల్ డేస్ గుర్తు చేసుకోవడం ఖాయమంటున్నారు. ఇద్దరి మధ్య లిప్ లాక్ సూపర్ గా ఉందని , దానికోసమైన మళ్లీ మళ్లీ చూడాల్సి వస్తుందని చెపుతున్నారు.

అలాగే మ్యూజిక్‌తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని , నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నయని , ప్రేమికుల రోజు ప్రేమికులంతా తప్పగా చూడాల్సిన చిత్రమని చెపుతున్నారు.