నాని హోస్టింగ్ ఫై మాధవీలత సంచలన వ్యాఖ్యలు..

ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిగ్ బాస్ 2 కు నాని హోస్టింగ్ చేస్తున్న సంగతి తెల్సిందే. జూన్ 10 నుండి ప్రసారమవుతున్న ఈ షో కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యం లో నాని హోస్టింగ్ ఫై నటి మాధవీలత తన స్పందనను తెలియజేసి వార్తల్లో నిలిచింది.

ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. బిగ్‌బాస్-2లో తనకు కూడా అవకాశం వచ్చిందని, ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యానని తెలిపింది. ‘బిగ్‌బాస్-2’ కోసం జరిగిన ఇంటర్వ్యూలో.. వారు మాట్లాడిన విధానం తనకు సౌకర్యంగా అనిపించలేదని , అందుకే, తాను ఆ అవకాశాన్ని వదులుకున్నానని, ఆ తర్వాత వారి నుంచి తనకు ఎలాంటి పిలుపు అందలేదని చెప్పుకొచ్చింది.

నాని హోస్టింగ్ ఎలా ఉందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘ఎన్టీఆర్ ఈ షో చేస్తున్నప్పుడు తొలి రోజు చాలా నెర్వస్‌గా ఫీలయ్యారు. ఆ తర్వాత ఆయన చాలా అద్భుతంగా షో నడిపించారు. నానికి మాటలు అలవాటు కాబట్టి.. తను ఈ షోను బాగానే నడుపుతున్నాడు. అయితే, ఎన్టీఆర్ షోను చూస్తున్నప్పుడు వచ్చినంత ఫీల్ నాని షో చూస్తున్నప్పుడు రావడం లేదు. బహుశా నేను అతనితో కలిసి నటించడం వల్ల కాబోలు’’ అని నాని హోస్టింగ్ ఫై తన స్పందను తెలిపింది.