ప్రియాంక తల్లి కాలేదట..అసలు ఏ జరిగిందంటే..

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లి కాబోతుందంటూ మీడియాలో ప్రచారమైన వార్తలు చూసి అంత నిజమే అనుకున్నారు. తనకన్నా చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయినా ప్రియాంక..అప్పుడే తల్లి అవుతుందా అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ వార్తల ఫై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించింది.

ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురు గర్భం గురించి క్లారిటీ ఇచ్చింది. అసలు ప్రియాంకా చోప్రా తల్లి కాబోతోందనేది మీడియా సృష్టి తప్ప అందులో నిజం లేదని ఆ రోజు కెమెరా యాంగిల్స్ ని సెట్ చేసుకోవడం వల్ల దొర్లిన పొరపాటు వల్ల అలా కనిపించిందే తప్ప ప్రియాంకా శరీరంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ప్రియాంక చాల బిజీ గా ఉందని , ఓషో జీవితం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ఓ వైల్డ్ లైఫ్ వెబ్ మూవీలో మా ఆనంద్ షీలా పాత్ర పోషిస్తోంది. దీని షూటింగ్ లో త్వరలోనే జాయిన్ కాబోతుందని తెలిపింది.