మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్‌లో ‘మ‌హానాయ‌కుడు’స్పెషల్ షో


ఎన్టీఆర్ మహానాయకుడు సందడి అప్పుడే మొదలైయింది. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ ఇంటింటి గడపకి పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ మొన్ననే ‘మహానాయకుడు’ ట్రైలర్ వదిలారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో రెండో బాగం ‘మహానాయకుడు’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా మ‌హానాయ‌కుడు సినిమా విడుదలకు ఒక రోజు ముందే షో ప‌డిపోతోంది. ఈనెల 22న మ‌హానాయ‌కుడు విడుద‌ల అవుతోంది. అయితే గురువార‌మే హైద‌రాబాద్‌లో ప్రీమియ‌ర్ షో ఫిక్స‌య్యింది. గురువారం రాత్రి 6.30 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్‌లో ప్రీమియ‌ర్ షో ఏర్పాటు చేశారు. సినీ తార‌లు, మీడియా కోసం ఈ షో ప్ర‌త్యేకం.