మహానాయకుడు తో అడల్ట్ పోటీ…

బాలకృష్ణ – క్రిష్ కలయికలో తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఏలాంటి అంచనాలు లేకుండా ఫిబ్రవరి 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి పార్ట్ ప్లాప్ కావడం తో రెండో పార్ట్ ఫై ఏలాంటి ఆసక్తి లేదు. ఏమైనా సినిమా బాగుందనే టాక్ వస్తే కానీ జనాలు థియేటర్స్ కు వెళ్లలేని పరిస్థితి. మహానాయకుడు పరిస్థితి ఎలా ఉంటె ఈ చిత్రానికి పోటీగా ఒకటి కాదు రెండు కాదు మూడు అడల్ట్ చిత్రాలు పోటీ పడుతుండడం తో వాటికీ డిమాండ్ ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఈ మధ్య కంటెంట్ చిత్రాలకంటే అడల్ట్ చిత్రాలకే తెగ డిమాండ్ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త బాగుందనే టాక్ వస్తే చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో చాలామంది నిర్మాతలు తక్కువ బడ్జెట్ తో కావాల్సిన మాసాలు సన్నివేశాలు జోడించి ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు.

తాజాగా ఆలా తెరకెక్కించిన చిత్రాలే చీకటిగదిలో చితక్కొట్టుడు, 4 లెటర్స్ , మిఠాయి ఈ మూడు సినిమాల్లో కావాల్సిన మసాలా ఉన్నాయని వీటి ట్రైలర్లే చెప్పాయి. దీంతో యూత్ అంత ఈ సినిమాలను చూసేందుకు పోటీ పడుతున్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన మిఠాయి చిత్రం పూర్తి అడల్ట్ కాకపోయినా కాస్త కూస్తో అలాంటి సన్నివేశాలు ఉన్నాయని అర్ధం అవుతుంది. ఇలా ఈ మూడు సినిమాలు ఒకే వారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఏ, బి సెంటర్లు పక్కనపెడితే.. సి-సెంటర్లలో మాత్రం వీటికి కాస్త వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. మరి ఈ మూడు సినిమాల ఎఫెక్ట్ మహానాయకుడు ఫై ఎలా పడబోతుందో చూడాలి.