మహర్షి ఫస్ట్ సింగిల్ డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు – పూజా హగ్దే జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. దిల్ రాజు..పివిపి..అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ మే 09 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తుది దశ కు షూటింగ్ చేరుకోవడం తో సినిమాకు సంబందించిన ప్రొమోషన్లను మొదలు పెట్టబోతున్నారు.

ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో దేవి ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో అందరికి అర్థమైంది. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి దేవిశ్రీ ప్రకటన ఇచ్చి అభిమానులను సంతోషంలో నింపారు. మార్చి 29 వ తేదీన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్టు దేవిశ్రీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

ఇక ఈ సినిమాలో మహేష్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. మహేష్ తో పాటు అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నరేష్ రోల్ సినిమాకు హైలైట్ గా ఉండబోతుందని అంటున్నారు.