మహర్షి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ సినిమా గా వస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని మే 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ పక్క మహేష్ 25 వ సినిమా వస్తుందని అభిమానులు సంబరాలు చేసుకుంటూనే మరోపక్క భయపడుతున్నారు. ఎందుకంటే మహేష్ గత సినిమాల ట్రాక్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది.

మహేష్ బాబు 5వ సినిమా టక్కరిదొంగ, పదో సినిమా అర్జున్, పదిహేనో సినిమా ఖలేజా, ఇరవయ్యో సినిమా ఆగడు… ఇవన్నీ చూస్తే మహర్షి కూడా ఎక్కడో తేడాకొడుతున్నట్టు అనిపిస్తుంది. టక్కరిదొంగ, అర్జున్, ఖలేజా, ఆగడు.. ఇవన్నీ మహేష్ కెరీర్ లో భారీ డిజాస్టర్లు గా మిగిలిపోయాయి. ఏదో అనుకుని తీస్తే.. ఇంకేదో అయిన సినిమాలివి. విడుదలకు ముందు భారీ హైప్ తో వచ్చి విడుదల తర్వాత మహేష్ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. సరిగ్గా ఆ లెక్క ప్రకారం మళ్లీ ఐదు సినిమాల గ్యాప్ తో మహర్షి వస్తోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయ్.

ఈ చిరంలో మహేష్ మూడు పాత్రల్లో కనిపిస్తుండడం..అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ రోల్ లో నటించడం..పూజా హగ్దే హీరోయిన్..దేవి సంగీతం..ముగ్గురు టాప్ నిర్మాతలు ఈ సినిమాకు పనిచేయడం ఇవన్నీ కూడా సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.. మరి ఈ సినిమా మహేష్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో..లేక వాటిలాగా భారీ ప్లాప్ అవుతుందా అని భయపడుతున్నారు. మరి ఈ సినిమా ఏం చేస్తుందో తెలియాలంటే మే 09 వరకు ఆగాల్సిందే.